ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు సరికాదు
మోత్కూరు ఆగస్టు 23 జనంసాక్షి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని తెలంగాణ జాగృతి జిల్లా యూత్ కో కన్వీనర్ సకినాల వివేక్ అన్నారు. కవితపై నిరాధారమైన వార్తలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. కేంద్రం వద్ద ఆధారాలు ఉంటే చట్టం ప్రకారం విచారణ చేపట్టాలి. కానీ కవిత వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ పోరాడుతున్నందున కవితపై నిరాధారమైన వార్తలు సృష్టిస్తున్నారని, ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే తెలంగాణ ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారని సకినాల వివేక్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని కవిత ఇంటిపై బిజెపి కార్యకర్తలు దాడి చేయడం సరికాదన్నారు. ఇది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల ఆగడాలను అడ్డుకొని, తరిమికొడుతామని సకినాల వివేక్ హెచ్చరించారు.