నిఖార్సయిన ఉద్యమకారిణి ఎమ్మెల్సీ కవిత: రాజీవ్ సాగర్
అధికార వ్యవస్థ లను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ: మేడె రాజీవ్ సాగర్
హైదరాబాద్:
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ ఖండించారు. నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారిణి అయిన ఎమ్మెల్సీ కవిత గారి మీద కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ శిఖండి రాజకీయాలు చేస్తోందని రాజీవ్ సాగర్ మండిపడ్డారు. అన్యాయాల మీద పోరాటం చేయడం తప్ప, ఇలాంటి దిగజారుడు చర్యలకు భయపడే వ్యక్తి ఎమ్మెల్సీ కవిత కాదన్నారు మేడె రాజీవ్ సాగర్. బీజేపీ ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత దీటుగా తిప్పికొట్టారని, బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేయనున్నారని మేడె రాజీవ్ సాగర్ ప్రకటించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న టీఆర్ఎస్ పార్టీ నేతలపై, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా భయపడేది లేదని మేడె రాజీవ్ సాగర్ స్పష్టం చేసారు.




