Thursday, 5 November 2026

మునుగోడు సభలో అమిత్ షా వ్యాఖ్యలపై ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 

ఫసల్ భీమా యోజన గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదు ?

వ్యవసాయ మోటార్లకు మీటర్లపై బీజేపీ వైఖరి అమిత్ షా స్పష్టం చేయాలి

కేసీఆర్ రైతు వ్యతిరేకి అనడం బీజేపీ నేతల అజ్ఞానానికి నిదర్శనం

తెలంగాణ మాదిరిగా రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు , సాగునీళ్లు దేశవ్యాప్తంగా అమలుచేసే దమ్ము , ధైర్యం బీజేపీకి ఉందా ?

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడయినా తెలంగాణ తరహా వ్యవసాయ అనుకూల పథకాలు ఉన్నాయా ?

ఎనిమిదేళ్లలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఏ పథకమైనా తీసుకువచ్చిందా ?

గత యాసంగిలో తెలంగాణ వరి ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం నిరాకరించిన మాట వాస్తవం కాదా ?

మరి బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణ దొడ్డు బియ్యం సేకరిస్తాం అని అమిత్ షా మునుగోడు సభలో చెప్పడం దేనికి సంకేతం ?

ఫసల్ భీమాలో భీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించేది ఎక్కువ, రైతులకు పరిహారం దక్కేది తక్కువ .. దేశంలో రైతులకు న్యాయం జరిగేలా కేంద్రం ఒక పథకం తేవాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశాం .. ఈ విషయంలో కేంద్రం ఎందుకు స్పందించడం లేదు

జాతీయ పార్టీకి రాష్ట్రానికో విధానం ఉంటుందా ? అధికారం ఇస్తేనే అనుకూలంగా ఉంటారా ?

16 నెలలు రైతులను ఢిల్లీ వీధుల్లో రాచిరంపాన పెట్టి, తీవ్రవాదులు అని అవమానించి 700 మంది రైతుల ఉసురుపోసుకుని క్షమాపణలు చెప్పి నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న వాళ్లు కేసీఆర్ ను రైతు వ్యతిరేకి అనడం హస్యాస్పదం

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతుభీమా, 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరంటు , సాగునీళ్లు ఏదీ కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు

 

కానీ కేసీఆర్ అమలుచేసి చూయించారు .. కానీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి కూడా వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేయలేదు, 60 ఏండ్లు నిండిన రైతులందరికీ పెన్షన్లు ఇవ్వలేదు .. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు, స్వామినాథన్ కమీషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధరలు ఇవ్వలేదు

ఒక జాతీయపార్టీకి రాష్ట్రానికో విధానం ఉంటుందా ? ఒక జాతీయ వ్యవసాయ విధానం ఉండదా ?

అమిత్ షా తెలంగాణ పర్యటనలో మోటార్లకు మీటర్లపై ప్రశ్నించిన రైతు ప్రతినిధుల మీద ఎందుకు రుసరుసలాడారు ?

అమిత్ షా ఆగ్రహిస్తే తలవంచడానికి తెలంగాణ సామంత రాజ్యం కాదు

కేసీఆర్ నాయకత్వంలో సుధీర్ఘ పోరాటంతో ఢిల్లీ మెడలు వంచి పార్లమెంటును ఒప్పించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం

పోరాటం తెలంగాణకు కొత్త కాదు .. తెలంగాణతో గోక్కున్నోడు ఎవడూ బాగుపడలేదు

 

రైతుబాంధవుడు కేసీఆర్ .. ఎనిమిదేళ్లలో తెలంగాణను ఆకలికేకల నుండి అన్నపూర్ణగా మలిచారు

సస్యశ్యామలం అవుతున్న తెలంగాణ మీద బీజేపీ నేతలు విషం కక్కుతున్నారు

బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజలు బుద్దిచెబుతారు

మునుగోడు సభలో అమిత్ షా వ్యాఖ్యలపై