Tuesday, 3 November 2026

ఎమ్మెల్సీ కోటిరెడ్డి కి కృతజ్ఞతలు

నాగార్జునసాగర్ ), జూలై 15,(జనం సాక్షి); తెలంగాణ ఉద్యమకారుడు నందికొండ మున్సిపాలిటీ ఐదవ వార్డు కౌన్సిలర్ రమేష్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కోటిరెడ్డి  విషయం తెలుసుకుని రమేష్ ని పరామర్శించి చికిత్సకు అవసరమయ్యే లక్ష రూపాయల ఎల్వోసీ ని మంజూరు చేశారు.నందికొండ మున్సిపల్  కౌన్సిలర్లు,టిఆర్ఎస్ ముఖ్య నాయకులు సకాలంలో సహాయం అందించినందుకు ఎమ్మెల్సీ కోటి రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, ఉద్యమకారుడు సపావత్  చంద్రమౌళి,మంద సంజీవయ్య,కారంపూడి విష్ణుమూర్తి, మైలపల్లి రమణ,బండి చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area