Tuesday, 3 November 2026

ఎయిడ్స్( HIV) పై అవగాహన

 

 

 

 

 

దండేపల్లి జనంసాక్షి మార్చి16 దండేపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం చైల్డ్ ఇండియా లింక్ వర్కర్ స్కిం ఆధ్వర్యంలో ఎయిడ్స్ (HIV) పై డిస్టిక్ రిసోర్స్ పర్సన్ పి. సరిత అంగన్వాడి కార్యకర్తల కు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ చేస్తున్న అభివృద్ధికి చైల్డ్ ఫండ్ ఇండియా 1951నుండి భారత దేశంలో 3 మిలియన్ల పిల్లలకు వారి కుటుంబాలకు చేయూతనిస్తుంది అన్నారు సుఖవ్యాధుల నిర్ములనకు కండోమ్స్ వాడాలని. స్త్రీ. పురుషుల మధ్య ప్రమాదం తగ్గించుకోవాలని అన్నారు HIV వ్యాపించే మార్గాలు అరక్షిత లైంగిక సంబంధాలు. కలుషిత సిరంజీలు (సూదులు).కలుషిత రక్త మార్పిడితో వచ్చే అవకాశం ఉంటుంది అని వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుక్యా. చంద్రకళ. ఎంపీటీసీ ముత్యాల.శ్రీనివాస్. ఉపసర్పంచ్. గొట్ల.భూమన్న
సహకార సంఘం చైర్మన్. కాసనగొట్టు. లింగన్న. లింక్ వర్కర్ విజయ లలిత ఓ ఆర్ డబ్ల్యు సాగర్. అంగన్ వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు