Tuesday, 3 November 2026

ఎయిర్‌పోర్టులో 35 తులాల బంగారం లభ్యం

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద కస్టమ్స్‌ అధికారులు ఆదివారం 350 గ్రాముల బంగారం పట్టుకున్నా రు. సింగపూర్‌ నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నట్టు శం షాబాద్‌ ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ విమానం దిగి ఎయిర్‌పోర్టు వెలుపలికి వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని ఆపి లగేజీని చెక్‌ చేయగా అందులో 350 గ్రాముల బంగారం లభించింది. దీంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చెన్నైకి చెందిన వాడని సమాచారం. ఈ కేసు నమోదు చేసుకొని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *