Tuesday, 3 November 2026

విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలపై సదస్సు

హైదరాబాద్‌ సిటీ : అమెరికాలో మాస్టర్స్‌, బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో విద్యావకాశాలపై ఔత్సాహికులకు ఉచిత అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శౌర్య కన్సల్టెన్సీ ప్రతినిధి రాధ మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులకు జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌, జీమ్యాట్‌ కోర్సులలో 50 శాతం రాయితీ ఇస్తున్నామని తెలిపారు. అమెరికాలో కంప్యూటర్‌ సైన్సు, ఐటీ, ఎలక్ర్టికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఫార్మా, బయోటెక్‌, ఎంబీఏ వంటి కోర్సులలో మంచి డిమాండు ఉందన్నారు. ఈ కోర్సులకు అక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయన్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు అవసరమైన ఫీజులు, స్కాలర్‌ షిప్‌లు, పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ వంటి అంశాలపై అవగాహన కోసం శౌర్య కన్సల్టెన్సీ ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. తాము రెండు రోజుల పాటు నగరంలో నిర్వహించిన సదస్సుకు మంచి స్పందన వచ్చిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *