-మార్క్‌ఫెడ్ చైర్యన్ కంచి రామారావు
హైదరాబాద్ రాష్ట్రంలో ఈ ఏడాది రాబోయే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య కంచి రామారావు వెెల్లడించారు. గత ఏడాది అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈ సారి 15లక్షల టన్నుల ఎరువులు విక్రయించడం ద్వారా 1500 కోట్ల వ్యాపారం చేయాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్ మార్క్‌ఫెడ్ సర్వసభ్య సమావేశం జరిగింది, కొత్తగా మార్క్‌ఫెడ్ పాలక వర్గం ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఈ సమావేశం ఏర్పాటైంది. సంస్థ చైర్మన్ కంచి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో ఎండీ కాడ్మియేల్ సహా 22 జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటి లిమిటెడ్ చైర్మన్లు, మేనేజర్లు పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న దృష్ట్యా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల పంపిణిపై పాలక వర్గం విస్తృతంగా చర్చించింది. ఈ ఏడాది ఎరువుల వ్యాపారంతో పాటు రాయితీ విత్తనాల వ్యాపారం కూడా చేయనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ రామారవు తెలిపారు.




