*రెవెన్యూ, ఇరిగేషన్ ,పంచాయతీ ,అధికారుల నిర్లక్ష్యం నిర్వాహకం ప్రభుత్వ భూముల కబ్జాలు: *ప్రభుత్వ భూముల పై ఫిర్యాదు చేసిన పట్టని వైనం: *అక్రమ కబ్జా పై ఫిర్యాదు చేస్తే దాడులే: *రెవెన్యూ అధికారుల దాసోహం:గణపురం మండలంలొ జరుగుతున్న ప్రభుత్వ భూములపై సోద్యం:*ప్రభుత్వం భూములపై జరుగుతున్న తీరు పట్టని ప్రభుత్వ అధికారులు …. భూపాలపల్లి ప్రతినిధి ఆగస్టు 7 జనం సాక్షి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లో గల ప్రభుత్వ భూములైన రెవెన్యూ, మైనింగ్ ,దేవాదాయ మాన్యం, చెరువు శిఖం ,కుంటశిఖం ,కాలువల శిఖరం, పంచ రాయి, పోరంబోకు భూముల అక్రమం గాభూకబ్జాలు చేసింది రికార్డుల సృష్టించి బ్యాంకు రుణాలు రైతుబంధు పేరులతో ప్రభుత్వాల ను కొల్లగొడుతూ నారు .అలాగే గణపురం మండలం లోని ధర్మ రావు పేట, కొండాపూర్, గణపురం , చేల్పూర్ గాంధీ నగర్, మైలారం ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం చేస్తూ భూముల పేరుతొ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ప్రభుత్వ భూములను సర్వే చేయాలి అనిఅధికారులు చెపినచేసేదాకా లు లెవని ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనరెవెన్యూ సదస్సు ఏర్పాటు ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వేనెంబర్ లో గల భూములను సర్వే నిర్వహించి అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనికాపాడాలని వేల కోట్ల రూపాయల విలువైన ఎర్ర కుంట అక్రమ భూ కబ్జాలు ఎలాంటి అనుమంతు లు లేకుండా అక్రమ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని సంబంధిత రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పట్టించుకునే వారు కరువయ్యారు .ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ ఇరిగేషన్ పంచాయతీ అధికారులు చొరవ చూపి చేల్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల థౌసండ్ కోటర్స్ ఎదురుగాగల మధవరావుపల్లి కాలనీ వెనబాగంలో ఉండబడినసమీపంలో గల ఈ ఎర్రకుంట లో అక్రమ భూకబ్జా లకు పాల్పడుతూ ఏలాంటిఅనుమతులు లేకుండా జరుగుతున ఇళ్ల నిర్మాణం లనుసంబంధిత అధికారులు చొరవ చూపి అక్రమ భూ కబ్జా చేసినఇళ్ల నిర్మాణాలను వెంటనే తొలగించాలని ప్రభుత్వన్ని జిల్లా కలెక్టర్ ను గ్రామస్థులు కోరుచున్నారు.




