వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి: తెలుగుదేశం నేత మండవ వెంకటేశ్వర్లు డిమాండ్
గరిడేపల్లి, ఆగస్టు 7 (జనం సాక్షి): వీఆర్ఏల సమస్యలను వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం గరిడేపల్లిలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని అర్హత కలిగిన వీఆర్వోలకు ప్రమోషన్లు కల్పించాలని 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ ల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షులు మాలోతు నాగు నాయక్, తెలుగు యువత అధ్యక్షులు పెండెం అంజయ్య గౌడ్, నాయకులు సురగాని ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.