Tuesday, 3 November 2026

ఎర్రచందనంను స్వాధీనం చేసుకున్నా ప్రభుత్వం: సీఎం

హైదరాబాద్‌: అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న తొమ్మిదివేల టన్నుల ఎర్రచందనం ప్రభుత్వం స్వాధీనంలో ఉందని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దీన్ని విదేశాలకు అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు రిజర్వ్‌ ఫారెస్టులో 63వ వనమహోత్సవాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు.రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘ ఒక్కరోజు  20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొలిమొక్క నాటి ప్రాంభించారు. తుమ్మలూరు రిజర్వ్‌ఫారెస్టులోని ఐదువేల హెక్టార్లలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజుతోపాటు రెండువేల మంది విద్యార్థులు మ్కొలు నాటారు. చెట్లను పెంచడం ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *