ఎర్రబెల్లి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక

మహబూబాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తొర్రూరు మండలం చీకటాయ పాలెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.