ఎర్రవల్లి మండలంగా తుది ప్రకటన జీవో కాఫీను అందుకున్న అలంపూర్ ఎమ్మెల్యే

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 28 : ఎర్రవల్లి నూతన మండలంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మండల ఏర్పాటుకు సంబంధించి జీవో కాఫీని హైదరాబాదులోని సెక్రటేరియట్ లో రెవెన్యూ జాయింట్ సెక్రటరీ రాంసింగ్ చేతుల మీదుగా అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ వి.యం.అబ్రహం అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నూతన మండలం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతన మండల ఏర్పాటు పై స్థానిక నాయకులు బాణసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాగన్న, కృష్ణ సాగర్, భీమేశ్వర్ రెడ్డి, ఎర్రవల్లి సర్పంచ్ రవి, రాముడు, జమ్మన్న తదితరులు ఉన్నారు.