హైదరాబాద్,సెప్టెంబర్5(జనం సాక్షి): ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నష్టాలను తగ్గించడంతో పాటు పర్యావరణానికి హానీ కలిగించని ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత ఏసీ బస్సుల మాదిరిగానే ఈ బస్సులను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం 40 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇవ్వగా.. ప్రస్తుతం 5 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఐదు బస్సులను సీనియర్ ఐఏఎస్‌లు అజయ్ మిశ్రా, అరవింద్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఒక్కసారి సరిపడినంతా ఛార్జింగ్ పెడితే.. 300 కిలోవిూటర్ల మేర ప్రయాణించవచ్చు. ఒక కిలోవిూటర్‌కు ఒక యూనిట్ చొప్పున కరెంట్ ఖర్చు అవుతుంది.




