Wednesday, 4 November 2026

ఎలిజబెత్ రాణి సేవలు మరువలేనివి :జైపాల్ రెడ్డి

:శామీర్ పేట్, జనం సాక్షి :దేవర యంజాల్ లో ఎలిజబెత్ రాణి సేవలు మరువలేనివని తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బీమిడి జైపాల్ రెడ్డి అన్నారు.శనివారం రోజు తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లో ఎలిజబెత్ రాణి గారి చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు,ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పీసరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ఎలిజబెత్ రాణి గారు నేను సర్పంచ్ ఉన్న సమయంలో గ్రామానికి వారి వివాహం రోజు అయిన 20 తేదీ 1983 నాడు విచ్చేసి గ్రామంలో కమ్యూనిటీ హాల్,షాపింగ్ కాంప్లెక్స్,గోబర్ గ్యాస్ ప్లాంట్ ను,పలు రోడ్లు, ప్రారంభించారు. అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారని తెలిపారు. వారి సేవలను కొనియాడారు.ఎలిజబెత్ రాణి గారి మరణం తీరనిలోటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి.జైపాల్ రెడ్డి ,మాజీ ఉప సర్పంచ్ టి.శంకర్ గౌడ్ ,జాతీయ కళా మండలి అధ్యక్షులు యన్ వై.అశోక్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు పి.లక్ష్మీనారాయణ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ యాదవ్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు యన్.హరిగోపాల్ ,రామాలయం మాజీ ధర్మకర్త టీచర్ పి.నరసింహారెడ్డి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి.జగన్ ,యన్.మల్లేష్ గౌడ్ ,యన్.శ్రీనివాస్ ,యస్.దుర్గయ్య ,పలువురు నాయకులు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.
10ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు