Tuesday, 3 November 2026

ఎల్లేని గెలుపు అదే కొల్లాపూర్ అభివృద్ధి కి మలుపు

జనం సాక్షి కొల్లాపూర్ జులై 25
బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు మండల కేంద్రం లో గడప గడప తిరుగుతూ
భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గడప గడప కు బీజేపీ గుండె గుండె కు ఎల్లేని సుధాకర్ రావు పెంట్లవెల్లి మండల కేంద్రం లో పర్యటించిన ఎల్లేని సుధాకర్ రావు గడప గడప తిరుగుతూ కేంద్రం ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వవలసిందిగా ప్రజలను కోరారు అంతే కాకుండా కొల్లాపూర్ వెనుకబటుకు కారణం గత నాయకుల చేతకాని తనమే అని ఈ సందర్బంగా తెలియజేశారు ఒకసారి అధికారం చేతికి ఇవ్వండి ఇంక్కా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాడు అన్నారు ఈ కార్యక్రమం లో ఎల్లేని తో పాటు బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు