Tuesday, 3 November 2026

కెసిఆర్ తోఫా లో లోపాలు : ఆనాయకులకు నచ్చిన వారికి  ?

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 25 ముస్లింలకు కూడా ఆర్థిక సహాయం చేయాలని కెసిఆర్ తోఫా ప్రతిష్టాత్మక ప్రవేశ పెట్టారు. కానీ ఆ నాయకులు ఆ తూఫా ను సరియైన పేద ముస్లింలకు అందేలాగా చూడటం లేదు వారి అడిగింది ఇస్తే ఏ సర్టిఫికెట్ లేకపోయినా సరే,కాదు అంటే అంతే సంగతి ఆ సర్టిఫికెట్ తీసుకురండి, ఈ సర్టిఫికెట్ తీసుకురండి,అన్ని బిఆర్ఎస్ నాయకులు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించాడు అన్న విధానంగా ఉంది పలు ప్రాంతాలలో బిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు.కెసిఆర్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఇస్తున్న తోపా పథకం పేదముస్లిం మహిళలకు అందకుండా నాయకులకు చేస్తున్నారు. కేసీఆర్ ప్రకటించి ఈ పథకాన్ని నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు, దీంతో పేద ముస్లిం మహిళలకు చుక్కెదురు అవుతుంది,పేదముస్లిం మహిళలకు శాపమా ? నాయకులకు వరంగా మారిందా ? ఒక సామాన్య మధ్యతరగతి పేద ముస్లింలు తమ బతుకుదెరువు కోసమే తమ ఇంట్లోనే సొంత కాళ్లపై నిలబడటం కోసం కుట్టు,అల్లికలు,స్వతహాగా నేర్చుకుని మిషన్ లో కొనుక్కోలేని పరిస్థితుల్లో కెసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మైనారిటీ మహిళలకు మేలు చేయాలని ఉద్దేశం తో ప్రవేశపెట్టిన కెసిఆర్ తోపా నిబంధనలతో ముస్లిం మహిళలు అనేక ఇబ్బందులుపడుతున్నారు.బీఆర్ఎస్ నాయకులు కొందరి ముస్లిం మైనారిటీమహిళలకు ట్రైనింగ్ సర్టిఫికెట్ సమర్పించాలని, కొందరికి అవేమీ లేకుండానే ఎలా చేయడం, అసలు రహస్యం ఏమిటి, దీన్ని ఆసరాగా చేసుకుని బిఆర్ఎస్ నాయకులు తమకు నచ్చిన వారికి  నిబంధనలు లేకుండానే తమకు నచ్చిన విధంగా సిఫార్సు చేయడం గమనార్ధం దీనిపై సామాన్య ప్రజలు అధికారులు, నాయకులపైమండిపడుతున్నారు.