Tuesday, 3 November 2026

నీట మునిగిన శివనగర్

 

వరంగల్ నగరం నడి బొడ్డున ఉన్నటువంటి శివనగర్ మునిగింది. గత రెండు రోజుల వర్షానికి, శివనగర్ ప్రజలు ఇండ్లలో నుండి రాలేని, పరిస్థితి నెలకొంది. శివనగర్ నేతాజీ స్కూల్ లైన్, వందన స్కూల్ లైన్, పల్లవి హాస్పిటల్ లైన్, పాకి లైన్ ఏకాశీల స్కూల్ లైన్ మొత్తం శివనగర్ ముంపునకు గురై ప్రజలు నిత్యావసర వస్తువులకు కూడా బయటకు రాలేకుండా ఉన్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర, సేవలైన మందులకు హాస్పిటల్ కు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు