హైదరాబాద్ : ఎల్ బినగర్ లో చోరీ.. దసరా పండక్కి సొంతూరుకువెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయింది.. దొంగలు నగలు, డబ్బు దోచుకోవడంతోపాటు… ఇంట్లో ఉన్న ఆహారపదార్థాలు ఖాళీ చేశారు. మద్యం మొత్తం తాగి… చికెన్ వండుకొని తినేశారు. హైదరాబాద్ ఇంద్రప్రస్థకాలనీ, జనప్రియ ఎన్‌క్లేవ్‌లో ఈ చోరీలు జరిగాయి. వరుసగా నాలుగు ఇళ్లను దోచుకున్నారు దొంగలు. లక్ష రూపాయల నగదు, ఆరు తులాల బంగారం ఎత్తుకెళ్లారు




