ఎల్, భోజ్య నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన సిజేఆర్ ముఖ్య అనుచరుడు ఎల్,శంకర్ నాయక్.

 

వారి కుటుంబానికి దిన కార్యాల కొరకు ₹ 5000/- ఆర్థిక సహాయం.

 

కోడేరు (జనం సాక్షి) జూలై 22 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలం,కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు ముఖ్య అనుచరుడు ఎల్ శంకర్ నాయక్,
కోడెర్ మండల పరిధిలోని గుండ్యవాల్య నాయక్ తాండకి చెందిన లావుడియా భోజ్య నాయక్ ఆర్థిక సమస్యలతో ఉరి వేసుకొని రెండు రోజుల క్రితం మరణించారు. గుండ్యావాల్యా నాయక్ తాండా గ్రామ నాయకులు జగదీశ్వర్ రావు ముఖ్య అనుచరుడు లావుడియా శంకర్ నాయక్ భోజ్య నాయక్ కుటుంబానికి 5000/-రూపాయలు ఆర్థిక సహాయం అందించి, భోజ్య నాయక్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు.