Tuesday, 3 November 2026

ఎవరి కోసమూ మెదక్‌ వదలను : విజయశాంతి

హైదరాబాద్‌ : మెదక్‌ సీటును ఎవరికోసమూ వదులుకునేది లేదుని టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ విజయశాంతి స్పష్టంచేశారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కొత్తగా పార్టీలోకి రావటానికి సిద్దంగా ఉన్న రెటైర్డ్‌ ఐఏఎస్‌ కేవీ రమణాచారి సైతం ఆసక్తిగా ఉన్నారనే వార్తలపై ఆమె స్పందించారు. ఈ మేరకు మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు.
”ఎన్నికలకు ముందు పార్టీలోకి ఐఏఎస్‌లో… ఐసీఎస్‌లో… పారిశ్రామికవేత్తలో వస్తే .. వారికోసం నాసీటును త్యాగం
చేయాలా?” అని ఆమె ప్రశ్నించారు. పార్టీ కోసం అందరి కంటే ఎక్కువగా తాను కష్టపడుతున్నానని పేర్కొన్నారు. ”మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిరిస్థితి బయటికంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఇది ఉద్యమాలు జరిగిన ప్రాంతం. అదే సమయంలో ఐఏఎస్‌లు, ఐసీఎస్‌లు, పారిశ్రామికవేత్తలు.. అణచివేతకు ప్రతీకలు. అలాంటిది ఒక ఉద్యమ పార్టీలోకి ఎవరుపడితే వాళ్లు వస్తే.. వారి కోసం సీటు ఖాళీ చేసేదిలేదని తేల్చిచెప్పారు.
ఒకవేళ కేసీఆరే అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటే ఆయనతో చర్చింస్తానని చెప్పారు. గత ఎన్నికల్లోనూ కేసీఆర్‌, నేనూ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పార్టీలో కొంత తర్జనభర్జన జరిగింది. తమతోపాటు సీనియర్లు అందరూ కూర్చొని చర్చించాకే కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ నుంచి, నేను మెదక్‌ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడూ అలాగే జరుగుతుంది అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *