Monday, 2 November 2026

ఎసెంఎస్‌తో మధ్యాహ్న భోజన వివరాల నమోదు

హైదరాబాద్‌,జూలై(జ‌నం సాక్షి): పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనాల విద్యార్థుల వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాలల్లో కొనసాగుతున్న మద్యాహ్న భోజనం పథకాన్ని ఎంతమంది విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు, ఎంతమంది పిల్లలు తినటంలేదనే వివరాలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. పాఠశాలలోని నమోదు సంఖ్య అధికారుల దగ్గర అందుబాటులో ఉండగా ప్రతిరోజు భోజనాలు చేసే విద్యార్థుల సంఖ్యను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులే నేరుగా ఎస్‌ఎంఎస్‌ విధానంతో పాఠశాల విద్యా శాఖకు చేరటానికి కొత్త విధానాన్ని తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ఉపసంచాలకులు కిషన్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టోల్‌ఫ్రీ నెంబరు 15544కు ఎస్‌ఎంఎస్‌ విధానంతో రిజిస్టేష్రన్‌ చేసుకోవాలి. ప్రతిరోజు అదే ఫోన్‌ నెంబరుతో పాఠశాలలో మద్యాహ్నభోజనం చేసే విద్యార్థులసంఖ్య తేల్చిన తర్వాత ఏజెన్సీలకు అందజేసిన బియ్యం ప్రకారంగా పిల్లల సంఖ్యను ఎస్‌ఎంఎస్‌ చేయాలి.