.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 16. (జనంసాక్షి) టీఎస్ పీఎస్సీ పేపర్ లిక్ వ్యవహారంపై చైర్మన్ జనార్దన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్వహణ వైపల్యం వల్లే విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారిందని కారణమైన చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని అన్నారు. నిరసన కార్యక్రమంలో నాయకులు రాకేష్, సాయి,భాస్కర్ ,శేఖర్ ,వేణు ,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.




