ఎస్కే సందాని సంతాప సభను చేయండి
-టిడిపి గుండాల మండలం కమిటీ
గుండాల,డిసెంబర్03(జనంసాక్షి);గుండాల ఎంపిటిసి, టిడిపి మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే సందాని సంతాప సభను విజయవంతం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు తోలెం సాంబయ్య పిలుపునిచ్చారు.విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 5వ తేదీన గుండాల మండల కేంద్రంలో సంతాప సభను నిర్వహించనున్నామని ,మంచి మనిషి ప్రజలకు ఆపద ఉందంటే ఆదుకునే వ్యక్తి అయిన సంధాని మరణం తెలుగుదేశం పార్టీకి గుండాల మండల ప్రజానీకానికి తీరని లోటని అన్నారు. రాజకీయాలకతీతంగా సంతాప సభలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఇల్లందుల అప్పారావు, మండల కార్యదర్శి ఇల్లెందుల నరసింహులు, ఎస్టీ సెల్ నాయకులు మొల్క మధు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు




