ఎస్పీఎం తెరిపించేందుకు కృషి

కాగజ్‌నగర్‌,జూన్‌14(జ‌నం సాక్షి): సిర్పూర్‌ పసేపర్‌ మిల్లు తెరిపించేందుకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెల్లడించారు. ఎస్పీఎంలో అత్యవసర విభాగాలైన కరెంట్‌, వాటర్‌ డిపార్టుమెంట్లలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఆర్నెళ్లుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలనుఇప్పించాలని కోరుతూ ఇటీవల పలువురు కార్మికులు మంత్రి జోగు రామన్నను కలిసి వినతి పత్రం అందజేశారు. మిల్లు పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగా ఇప్పటికే మిల్లుకు అనేక రాయితీలు ప్రకటించిందని గుర్తు చేశారు. త్వరలోనే మిల్లు కార్మికులకు మంచి రోజులు వస్తాయని, పెండింగ్‌ వేతనాలు కూడా వచ్చేలా కృషి చేస్తానని హావిూ ఇచ్చారు.