Tuesday, 3 November 2026

ఎస్సై వివాహేతర సంబంధం.. భార్య ఆందోళన

హైదరాబాద్‌,నవంబర్‌ 8 (జనం సాక్షి) : మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్సై ఇంటి వద్ద ఆయన భార్య ఆందోళనకు దిగింది. నాచారం పీఎస్‌ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహేశ్వరం ఎస్సై నర్సింహకు.. మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బంధువులతో కలిసి మహిళ ఇంటి వద్ద నర్సింహ భార్య ఆందోళన చేపట్టింది. భార్య, ఆమె బంధువులను చూసిన నర్సింహ అక్కడి నుంచి పరారయ్యాడు. ఓ కేసులో నర్సింహ సస్పెండ్‌ కావడం గమనార్హం. నర్సింహపై ఆయన భార్య ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.