Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ విూర్‌పేట్‌లో పేలుడు..

 హైదరాబాద్‌,నవంబర్‌ 8 (జనం సాక్షి) : విూర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పేలుడు కలకలం రేపింది. విజయపురి కాలనీలో చెత్త ఏరుకుంటున్న ఓ మహిళ డబ్బాను నేలకేసి కొట్టడంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురి కాలనీలో చెత్త ఏరుకునే మహిళకు చెత్తకుప్ప సవిూపంలో డబ్బా దొరికింది. దీంతో ఆమె డబ్బాను తెరిచేందుకు యత్నించింది. అయితే డబ్బా తెరుచుకోకపోవడంతో.. దానిని నేలకేసి కొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చెత్త ఏరకునే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.