హైదరాబాద్,జులై24(జనంసాక్షి): తెలంగాణలో ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేపట్టింది.
ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోస్టులకు ఎంపికైనవారి ఫొటోలు, సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. తర్వాత మెడికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌తో పాటు పాత పది జిల్లాకేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తుది రాతపరీక్షకు హాజరైన సమయంలో అభ్యర్థుల నుంచి సేకరించిన వేలిముద్రలను.. మెడికల్ టెస్ట్‌లకు వెళ్లేముందు సరిపోల్చనున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు.




