Thursday, 5 November 2026

ఎస్ ఆర్ శంకరన్ కు ఘన నివాళి…

 నివాళి అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ గోపి
వరంగల్ బ్యూరో  అక్టోబర్ 7(జనం సాక్షి)
       ఎస్సార్ శంకరన్ ఐఏఎస్  12వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.గోపి శంకరన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సార్ శంకరన్ ఐఏఎస్ గారు వారి విధి నిర్వహణలో బాగంగా ఒక్క సంవత్సరంలోనే 12 సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, అంతటి గొప్ప ఐఏఎస్ అధికారిని ఈ రోజున స్మరించు కోవడం  సంస్కరణలే కారణం అని వారిని ఈ సందర్భంగా గుర్తు చేసారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట అదనపు కలెక్టర్  హరి సింగ్ ఆర్డిఓ మహేందర్ జీ  డి ఆర్ డి ఓ సంపత్ రావు, సిపిఓ జీవరత్నం, డిటిడిఓ ఎస్.కె జహీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.