ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల నిరసన
వేములవాడ రూరల్, ఆగస్టు 17 (జనంసాక్షి): వేములవాడ మండల విద్యాధికారి కార్యాలయం వద్ద మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం మూతికి నల్ల గుడ్డ కట్టుకొని నిరసన తెలియజేశారు. తమ సమస్యల సాధనకై బుధవారం హైదరాబాద్ లోని ఎస్పిడి కార్యాలయం వద్ద శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎం ఐ ఎస్ నవీన్, సల్మాన్ సిఆర్పిలు ఎల్లేష్, నగేష్, చైతన్య, సి సి ఓ ధనుంజయ్, మెసెంజర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు