బిఆర్ఎస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు..
ధర్మపురి (జనం సాక్షి )పెద్దపల్లి ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామ నుంచి ధర్మారం మండల వైస్ ప్రెసిడెంట్ బద్దం వెంకట్ రెడ్డి, మరియు దుడ్డెల హరీష్ ఆధ్వర్యంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఉప్పల తిరుపతి (RMP), అరవింద్ రెడ్డి, బిజెపి పార్టీ నుండి అన్నెడ తిరుపతి రెడ్డి, ASF నుండి కాంపల్లి అజయ్, BSP పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొలకూరి అజయ్ మరియు వివిధ పార్టీల కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది,
ఈ కార్యక్రమంలో మేడారం పిఎసిఎస్ చైర్మన్ బలరాం రెడ్డి, ఆకరి సత్యం పాల్గొన్నారు.