ఎస్.కె ఇక్బాల్ కుటుంబానికి ఆర్థిక సాయం

ఎస్.కె ఇక్బాల్ కుటుంబానికి ఆర్థిక సాయం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 04 (జనం సాక్షి)

వరంగల్ నగరంలోని శంభునిపేటకు చెందిన ఇక్బాల్ వెల్డింగ్ షాప్ యజమాని ఎస్.కె ఇక్బాల్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న వినాయక పరపతి సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యుడు అయినా ఇక్బాల్ అకాల మరణం పట్ల వారి కుటుంబానికి సంఘం తరుపున ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు అదేవిధంగా సంఘం కార్యాలయం నుండి ఇక్బాల్ కుటుంబానికి 50,000 డబ్బులు గౌరవ అధ్యక్షులు వడ్లకొండ మల్లికార్జున్ సహాయ కార్యదర్శి అడుప ప్రభాకర్, ముఖ్య సలహా దారులు ఖిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్అధ్యక్షులు కేడల జనార్ధన్ , కత్తి సాంబేశం, కోషాధి కారి అనుమాండ్ల రమేష్ , పిన్న మల్లికార్జున్ , పోసాల మల్లికార్జున్ చేతులమీదుగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఎంతో మంచి పేరు కలిగి ఉన్న మృతుడు ఇక్బాల్ మృతదేహాన్ని సందర్శించి పలువురు సంతాపం తెలియజేశారు.