ఏఎన్ఎం లకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు ….

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):—యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 18 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రెండవ ఏఎన్ఎం లను సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఇంచార్జ్ పంజాల రామాంజనేయులు గౌడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన కరోనా సమయంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ధైర్యం చెప్పి వృత్తి పట్ల సేవలు అందించారు ఆసుపత్రిలో ఏఎన్ఎం వారి సేవలు గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు వచ్చే ది కాంగ్రెస్ ప్రభుత్వం మీ సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తోటే సాధ్యమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయని అన్నారు .టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఈరపాక నరసింహ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల మనోజ్ కుమార్ యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.