హైదరాబాద్,(జనంసాక్షి): ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యంపై హైకోర్టు ఫైర్ అయింది. అడ్మిషన్ల ప్రక్రియలో ఎందుకు ఆలస్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతుందని ఇంజినీరింగ్ ఫీజుల సమీక్ష, కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థులు వేసిన పిటిషన్‌ను ఇవాళ న్యాయమూర్తి విచారించారు. ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏఎఫ్‌ఆర్‌సీపై మండిపడ్డారు. ఈ అంశాలపై ఈ నెల 28 లోగా తమకు నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.




