– ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల ప్రసన్న కుమార్ పిలుపు.
హనుమకొండ బ్యూరో ఆగస్టు 19 జనం సాక్షి
శుక్రవారం రోజున అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర 03 వ మహాసభల కరపత్రం ఆవిష్కరించడం జరిగిందని ప్రకటనలో తెలిపారు,
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ
ఉద్యమాల గడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆగస్టు 26, 27, 28. తేదీలలో మూడు రోజులపాటు ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు ప్రతిష్టాత్మకంగా జరగనున్న యనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలేనీ నిస్సహాయ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు…..
ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని దానిలో భాగంగానే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు రెడ్ కార్పేట్ వేసి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని… ఈదీ సరైన విధానం కాదని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి ఈ రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని మూడు రోజులు ప్రతిష్టాత్మకంగా జరిగే రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఊటుకూరి ప్రణీత్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కసరబోయిన బోయిన రవితేజ నాయకులు రాజు, అనిత ,సురేందర్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.




