ఏటా పేదల పింఛన్లకు 12 వేల కోట్లు

* పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

* కొత్తగా 10లక్షల పింఛన్లు

* కేసీఆర్ గొప్ప మానవతా మూర్తి

* నగర పాలక సంస్థ లో 5,678మందికి పింఛన్ల పంపిణీ

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఆదివారం కరీంనగర్ మాచర్ల గార్డెన్ లో నగరపాలక సంస్థ పరిధిలోని 34, 35, 36 ,54 డివిజన్ల లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డులను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ దేశం మొత్తం మీద సామాజిక పింఛన్లను పెద్ద సంఖ్యలో అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అందుతున్న పెన్షన్లలో కేంద్రం వాటా వందలోకేవలం రూ.1.80 పైసలు మాత్రమే అని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేసినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంఅన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. కరీంనగర్ మీద ఉన్న అభిమానంతో ,తీగల వంతెన ,మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ,ప్రభుత్వ మెడికల్ కళాశాల తో పాటు,10 ఎకరాల స్థలంలో టీటీడీ ఆలయం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అన్నివర్గాల సంక్షేమం మే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాటు పడుతుందని అన్నారు. నగరంలో గతంలో 20,768 పెన్షన్లు మాత్రమే ఉండేవని ,కొత్తగా 5,678 మంజూరైన నవని తెలిపారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామని, ఆసరా పెన్షన్ల నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. పెన్షన్ రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని అన్నారు.
వృద్ధులు,దివ్యాంగులు, వితంతువులు,ఒంటరి మహిళలు, బోదకాలు, హెచ్ఐవి బాధితులు,కిడ్నీ వ్యాధిగ్రస్తులు, చేనేత, గీత, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ “ఆసరా”గా, వారి జీవితాలకు భరోసా కల్పించారని, కొండంత అండగా నిలిచారన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన 10లక్షలతో పెన్షన్ల తో కలిపి మొత్తం 46లక్షల మందికి ప్రతి నెల పింఛన్లు అందుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఏటా 12వేల కోట్లు ఖర్చవుతాయని, వయో పరిమితిని 65 నుంచి 57ఏండ్లకు తగ్గించారని తెలిపారు.

ఈ విధంగా గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందరిని ఆదుకుంటున్న కేసీఆర్ గొప్ప మానవతా మూర్తి అని చెప్పారు. తెలంగాణ గొప్ప లౌకిక, సంక్షేమ,శ్రేయోరాజ్యంగా దేశం మొత్తం మీద పేరుగాంచిందని మంత్రి కొనియాడారు.అన్ని వర్గాల ప్రజల భద్రత, సంక్షేమం, ఉన్నతికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ పాలనకు సంపూర్ణ మద్దతునివ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్లో స్వరూప రాణి హరి శంకర్ అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ ,కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ-శ్రీనివాస్ ,డిండిగాల మహేష్ ,చాడగొండ బుచ్చి రెడ్డి ,అతీనా తదితరులు పాల్గొన్నారు.