హైదరాబాద్: ఏడాదిలోపు అన్ని జూనియర్ కాలేజీలకు భవనాలు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలు నిర్వహిస్తామని, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.




