ఏడుపాయల వనదుర్గామాత పాలకవర్గం ప్రమాణ స్వీకారం
జనం సాక్షి/ పాపన్నపేట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఏడుపాయల ఆలయ నూతన పాలక వర్గం సోమవారం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్త కె.యాదగౌడ్ సాతేల్లి బాలగౌడ్ ను ఆలయ చైర్మన్ గా బలపరచగా,మరోధర్మకర్త యు. వేంకటేశం ఆమోదించారు.మిగతా ధర్మకర్తలు బి.మానెమ్మ, ఎం. నాగభూషణం, డి. మనోహర్, కే. శ్రీనివాసరావు , ఏ. మోహన్ రావు యు. పెంటయ్య , ఎన్. సాయిలు, ఆర్. చక్రపాణి , ఎన్. సిద్ధి రాములు, ఆర్. బాగా రెడ్డి , పి. రఘువీర్ , ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఆర్.శంకర్ శర్మ లు అందరూ కలిసి సాతెల్లి బాలగౌడ్ ను ఆలయ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.దేవాదాయ ధర్మాదాయ ఇన్స్పెక్టర్ రంగారావు వీరితో ప్రమాణస్వీకారం చేయించారు.ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది జూనియర్ సహాయకులు
పి.మధుసూదన్ రెడ్డి ,
వి.లక్ష్మీనారాయణ
సూర్యశ్రీనివాస,పూజారులు తదితరులు పాల్గొన్నారు.