ఏడేళ్ల తరువాత కాస్ట్రో దర్శనం

హవానా; జనంసాక్షి: క్యూబా ప్రజల ఆరాధ్య నేత ఫిడేల్‌ కాస్ట్రో దాదాపు ఏడేళ్ల తరువాత బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చారు. ఓ పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి 86 ఏళ్ల కాస్ట్రో హాజరయ్యారని స్థానిక వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. క్యూబా రాజాధాని హవానా లో 140 మంది విద్యార్థుల కోసం పాఠశాల నిర్మాణం చేపట్టాలని, ఫిడెల్‌ కాస్ట్రో గతంలో కోరారు. ఈ సంతర్భంగా ఆయన దాదాపు 2 గంటల పాటు వాతావరణ మార్పు, ఇంధన ధరలు, ఆహారోత్పత్తి, ఆర్థిక సంక్షోభం పై విదార్థులతో ముచ్చటించారు.