Thursday, 5 November 2026

ఏపీకి రాజధాని లేకుండా చేశారు

నాలుగేళ్ల తెదేపా పాలనలో 4లక్షల కోట్ల అవినీతి
వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్‌, జూన్‌9(జనం సాక్షి ) : ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా పోయిందని, కనీసం ఉమ్మడి రాజధాని కూడా లేకుండా చేశారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల అవినీతికి టీడీపీ సర్కార్‌ పాల్పడిందని ఆమె ఆరోపించారు. గత నాలుగేళ్ల పాలనలో ఏపీ సర్కార్‌ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలు చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఏపీకి అస్థిత్వం లేకుండా అన్యాయం చేశారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని 25ఏళ్లు వెనక్కి నెట్టేలా పాలన కొనసాగించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు అభద్రతాభావం కల్పించిన చంద్రబాబును మళ్లీ ఎందుకు ఆశీర్వదించాలని ఏపీ సీఎంను వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం చేసిన మిమ్మల్ని ఎందుకు గెలిపించాలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చెప్పాలన్నారు. ప్రత్యేక ¬దా కోసం వైసీపీ పోరాడుతుంటే ప్రత్యేక ¬దా పాచిపోయిన లడ్డూ.. ప్రత్యేక ప్యాకేజీ తీసుకుందామని ఏపీ ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబన్నారు. ప్రత్యేక ప్యాకేజీకూడా తేకుండా తన సొంత పనులను కేంద్రంతో అంటకాగి
చక్కబెట్టుకున్నారని అన్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకొనేందుకు కేంద్రం నుంచి బయటకొచ్చి మళ్లీ ప్రత్యేక ¬దా అంటూ ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబు జిమ్మిక్కులను గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్పేలా సిద్ధంగా ఉన్నారని పద్మ తెలిపారు.