డిసెంబరులో విడుదల చేసిన ప్రకటనల గడువు పెంపు
హైదరాబాద్: గ్రూప్ -4 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితాలు ఇవాళ, రేపట్లో జిల్లాలకు చేరుకోనున్నాయి. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా జిల్లాల్లోని పోస్టులను కలెక్టర్ల నేతృత్వంలో భర్తీ చేస్తారు. మెరిట్ జాబితాను రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఉంచుతారు. 1355 పోస్టుల భర్తీకి సంబంధించి 2008లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 4 ప్రకటన ద్వారా గత ఏడాది ఆగస్టు 11న జరిగిన రాత పరీక్షలో నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇదిలా ఉండగా గత డిసెంబరులో విడుదల చేసిన నాలుగు ప్రకటనల తుది గడువును ఏపీపీఎస్సీ పోడిగించింది. ఇందులో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల గడువును ఈనెల 23 వరకు, ఏపీ కాలేజియేట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ ఉద్యోగాల గడువును మార్చి 8 వరకు, చైల్డ్ డెబవవ్‌మెంట్ ప్రాజెక్టు అధికారి ఉద్యోగాల గడువును మార్చి 18 వరకూ పొడిగిస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.




