Tuesday, 3 November 2026

ఏపీ ప్రత్యేక హోదాకు.. 

కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది
– తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని తెరాస చూస్తుంది
– టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు ఓ రూమర్‌
– ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి
హైదరాబాద్‌, జులై27(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీలు అన్నారని చెప్పారు. ఈ మేరకు  సీడబ్ల్యుసీ విూటింగ్‌లో ఏపీ ప్రత్యేక ¬దా అంశం విూద రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలు ఇచ్చిన హావిూ వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ప్రత్యేక ¬దా ఏపీ ప్రజల హక్కు అని, వేరే రాష్ట్రంతో పోల్చుకోవద్దని, సోనియా, రాహుల్‌ అన్నట్లు తెలిపారు. ఈ విషయంపై సోనియా, రాహుల్‌ గాంధీలకు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్‌కి ఇస్తేనే ప్రత్యేక ¬దా సాధ్యం అవుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్‌, కేకే, ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని పదుల సార్లు చెప్పారని, కానీ ఇప్పుడు ఇద్దరు చంద్రులు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. గట్టిగా అడగొద్దని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా చెప్పి ఉంటారని అందుకే కేసీఆర్‌ అలా అంటున్నారని చెప్పారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో హైదరాబాద్‌ నుంచి 80శాతం ఆదాయం వచ్చేదని.. విభజన తర్వాత… హైదరాబాద్‌ ఆదాయం ఏపీకి రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రాలోనూ అధికారంలోకి వస్తామని రఘువీరా ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు అనేది ఓ రూమర్‌ మాత్రమేనని, ఆ ఆలోచనే కాంగ్రెస్‌కు లేదని, ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ పొత్తుల విషయంపై ఆలోచిస్తారని అన్నారు.