ఆదిలాబాద్ జనవరి31( జనం సాక్షి )తాజాగా ఏసీబీ అధికారులు విసిరిన వలకు అవినీతి అధికారులతో పాటు మరో ఉద్యోగి చిక్కిన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. అదిలాబాద్ జిల్లా ఉపాది కల్పనాధికారి కార్యాలయంలో.. ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్, అసిస్టెంట్ ఉపాధి కల్పనాధికారి విజయలక్ష్మి, రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ తేజా లు కాంటాక్ట్ ఉద్యోగాల నిమిత్తం ఓ కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేశారు. కానీ అధికారుల తీరుతో విసిగిపోయిన సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో సదరు కాంటాక్ట్ నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఇద్దరు అవినీతి అధికారులను ఉద్యోగాన్ని రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఏసీబీ అధికారులు ఇంకా విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




