Wednesday, 4 November 2026

ఏ జి పి గా నియమితులైన గుడిసె సదానందం

 

వేములవాడ, జూలై 28 (జనంసాక్షి) వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏ.జి.పి. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్) గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది గుడిసె సదానందం గత పది సంవత్సరాలుగా న్యాయవాదవృత్తిలో రాణిస్తూ, బార్ అసోసియేషన్ లో ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలను నిర్వహిస్తూ, పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పలువురి మన్ననలను పొందారు.ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన వేములవాడ శాసన సభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.