విఆర్ ఏ ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

-తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య గార్ల మండల కార్యదర్శి వీరన్న

మహబూబాబాద్ బ్యూరో-జూలై28(జనంసాక్షి)

విఆర్ఎ ల న్యాయమైన డిమాండ్లను వేంటనే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య గార్ల మండల కార్యదర్శి బట్టు.వీరన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. విఆర్ఎస్ఐ ల జాక్ పిలుపు తో గార్ల మండల కేంద్రంలోని తహశిల్దార్ కార్యలయం ఎదుట నాలుగవ రోజు కొనసాగుతున్న నిరవదిక నిరసన దీక్షకు గిరిజన సమాఖ్య తరుపున బట్టు వీరన్న దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. దీక్షలో విఆర్ఎల సంఘం మండల అధ్యక్షడు ఏదుల. వెంకన్న, ఉపాధ్యాక్షడు భూక్య వెంగల్ రావు,వేశమల్ల.శినివాస్,శ్రీను, భూక్య, శ్రీను, మౌనిక, బాదం. రాము, అచ్చుత్ రావు తదితరులు పాల్గోనారు