Wednesday, 4 November 2026

ఏ వి వి డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ బ్యాంక్ వారి క్యాంపస్ ఇంటర్వ్యూస్

 

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 09 (జనం సాక్షి)

 

వరంగల్ నగరంలోని ఏ వి వీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఐసిఐసిఐ బ్యాంకు వారు “రిలేషన్షిప్ మేనేజర్ “పోస్టుల కోసం కళాశాల లో ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం క్యాంపస్ ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి సంజీవరావు గారు తెలిపారు. ఈ సందర్భంగా ఐసిఐసి బ్యాంకు ప్రతినిది హర్షద్ మాట్లాడుతూ ప్రముఖ విద్యా సంస్థ అయినా ఏవీవి కళాశాలలో క్యాంపస్ ప్లేస్ నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ బుజేందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు సబ్జెక్టు విషయంలో లతోపాటు పోటీ పరీక్షలలో పాల్గొంటూ వ్యక్తిత్వ లక్షణాలను మెరుగుపరుచుకొని ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకు అధ్యాపకేతర సిబ్బంది మరియు 80 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు .