హక్కులు, చట్టాల కోసం ఆదివాసీలు పోరాడాలి

టేకులపల్లి, ఆగస్టు 9( జనం సాక్షి): ఆదివాసి హక్కుల చట్టాల కోసం ప్రతి ఒక్కరూ విధిగా పోరాడాలని ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని ముత్యాలంపాడు గ్రామంలోబుధవారం ఆదివాసి జెండాను తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి దుగ్గారపు వీరభద్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ డివిజన్ కార్యదర్శి జోగా గోవర్ధన్, ఐకాసా జిల్లా నాయకులు కంగాల వసంత్, బలరాం శ్రీరామ్, కుంజదుర్గ, గుమ్మడి ప్రసాద్, టేకులపల్లి మండల గొగ్గల అశోక్,విద్యార్థి సంఘ నాయకులు, వట్టం నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు