ఐఐటి విద్యార్థినికి ఘన సన్మానం
వీపనగండ్ల అక్టోబర్ 22 (జనంసాక్షి) మండల కేంద్రంలోని కల్వరాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్వరాల గ్రామంలోని పాఠశాల పూర్వ విద్యార్థిని భవ్యశ్రీకి ఐఐటి ధన్బాద్ ఝార్ఖండ్ రాష్ట్రంలో సీటు సాధించడం జరిగింది. ఈ అమ్మాయికి కల్వరాల ఉద్యోగుల సంఘం తరఫున ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శంకరయ్య మాట్లాడుతూ విద్యార్థులు మంచి స్థాయికి ఎదగడానికి ఉద్యోగుల సంఘం మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీపనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య సంఘం సభ్యులు మద్దిలేటి విజయ్ శివశంకర్ యాదవ్ శివ కృష్ణవేణి అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.