Wednesday, 4 November 2026

ఐకియాతో వేయిమందికి ఉద్యోగాలు

19న హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న సంస్థ

హైదరాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ కేంద్రంగా ప్రముఖ గృ¬పకరణాల సంస్థ ఐకియా ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఈ సంస్థ గతంలోనే ఒప్పందం చేసుకుంది. దేశంలోనే మొట్టమొదటగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కేంద్రాన్ని ఈ నెల 19న ప్రారంభించనుంది. ఈ స్టోర్‌ను రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో తొలి దశలో వెయ్యి మందికి ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించనున్నట్లు సంస్థ ఇండియా సీఈవో ప్రకటించారు. మూడేండ్ల క్రితం స్టోర్‌ ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల వల్లే త్వరతగతిన స్టోర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులు ఉండేలా స్టోర్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందుకోసం దేశంలోని దాదాపు వెయ్యికి పైగా నివాసాలకు వెళ్లి ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నామని వెల్లడించారు. విశాలమైన ప్రాంగణాల్లో నివసించే వారితోపాటుగా పరిమితమైన స్థలంలో నివసించే కుటుంబాలకు కూడా తగిన గృ¬పకరణాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అటు ప్రపంచవ్యాప్తంగా ఐకియా స్టోర్లలో రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే అన్నింటి కంటే పెద్దది.. వెయ్యి సీట్ల సదుపాయం గల రెస్టారెంట్‌ను హైదరాబాద్‌ స్టోర్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భారతీయ, విదేశీ వంటకాలు కూడా ఉంటాయన్నారు. ఇక్కడ మొత్తం ఉద్యోగుల్లో సగం మంది మహిళలేనని ఆయన స్పష్టం చేశారు. ఇక వచ్చే ఏడాది తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం 10 శాతానికి పైగా ఉత్పత్తులను తమ నూతన కేంద్రం కోసం సేకరిస్తున్నామన్నారు. త్వరలో దీన్ని మరింత పెంచుతామని ఆయన వెల్లడించారు. ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు తమ స్టోర్‌ తెరిచే ఉంటుందన్నారు. అందుబాటు ధరల్లో వస్తువులను అందించమే గాక వస్తువుల డెలివరీ విషయంలోనూ వినియోగదారుల ఆకాంక్షలకు తగినట్లుగా వెళ్తున్నట్లు చెప్పారు.ప్రముఖ గృ¬పకరణాల సంస్థ ఐకియా రూ. వెయ్యి కోట్లతో హైదరాబాద్‌లో స్టోర్‌ ఏర్పాటు చేయడంతో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.