Wednesday, 4 November 2026

కాన్వాయ్‌ కోసం ట్రాపిక్‌ను ఆపరాదు: డిజిపి

విజయవాడ,జూలై5(జ‌నం సాక్షి ): తనకోసం ట్రాఫిక్‌ను ఆపి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఎపి డిజిపి తన పోలీసులకు గట్టిగానే చెప్పారు. గురువారం గన్నవరం విమానాశ్రయానికి ఠాకూర్‌ వచ్చారు. తన కోసం ట్రాఫిక్‌ నిలిపివేసిన పోలీసులపై ఎపి డిజిపి ఆర్పీ ఠాకూర్‌ అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ ను నిమిషం పాటు కూడా ఆపవద్దని ఆర్పీ ఠాకూర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే తీరు సరికాదని అభిప్రాయపడ్డ ఆయన, ఇకపై తాను ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్‌ ను ఆపరాదని ఆదేశాలు ఇస్తూ, ఇదే విషయాన్ని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు సూచించారు. విఐపిలు ప్రయాణిస్తున్న వేళ కూడా సాధ్యమైనంత తక్కువగా మాత్రమే ట్రాఫిక్‌ ను ఆపాలని ఆయన సూచించారు.